Devendra Fadnavis: భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” పాల్గొన్నారు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!
- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
- భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" పాల్గొన్నారు..
- భారత ఎన్నికలలో విదేశీ జోక్యం ఉంది: సీఎం ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 15వ తేదీన ఖాట్మండులో జరిగిన రహస్య సమావేశంలో ఈవీఎంలను వ్యతిరేకించడంతో పాటు మహారాష్ట్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లను ప్రవేశ పెట్టడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారని అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపించారు. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో అశాంతిని ప్రేరేపించడానికి అనేక కుట్రలు చేశారని తెలిపారు. ఇక, ఎన్నికల్లో టెర్రర్ ఫండ్స్ వినియోగంపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేసిన విచారణలో భారత ఎన్నికలలో విదేశీ జోక్యానికి గల ఆధారాలు ఉన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
Read Also: Paritala Ravi: పరిటాల రవి హత్య కేసు.. బెయిల్‌పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు!
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ఇక, కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌లుగా కొనసాగుతున్న 40 సంస్థలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే, 2014లో మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో లోక్‌సభలో 72 ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌ల పేర్లను ప్రస్తావించిందన్నారు. ఇక, వాటిలో 7 సంస్థలు భారత్ జోడో యాత్రలో భాగమేనని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) కోసం ఈ సంస్థలు ప్రచారం చేశాయన్నారు. అర్బన్ నక్సలిజాన్ని ఎదుర్కోవటానికి మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2024ని అసెంబ్లీలో మహాయుతి ప్రభుత్వం సమర్పించింది.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!