మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు అహల్యా నగర్‌లో సీనియర్ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నా హజారేతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ అన్నా హజారేతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా ఉన్నారు. సీఎం దేవేంద్ర తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోను పంచుకున్నారు.
READ MORE: Health and Fitness: వేగంగా నడిస్తే ఎన్ని లాభాలంటే?.. అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు
ఇందులో ఆయన అన్నా హజారేతో కరచాలనం చేస్తూ.. తల వంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే కూడా సీఎం చేయి పట్టుకుని ఆయనతో మాట్లాడి ఆశీస్సులు ఇస్తున్నట్లు చూడొచ్చు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం అహల్యా నగర్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా అహ్మద్‌నగర్‌కి వచ్చారు. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు అన్నా హజారే హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. సీఎం హెలికాప్టర్ నుంచి దిగగానే అన్నా హజారే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఫడ్నవీస్ ఆయనకు వంగి నమస్కరించారు.
READ MORE:UP: 18 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడ్డ 51ఏళ్ల మహిళ.. చివరికీ..
కాగా.. మహారాష్ట్రలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం సాధించింది. తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రుల శాఖలను కేటాయించారు. అతి ముఖ్యమైన హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఫడ్నవీస్ ఇంధనం, చట్టం, న్యాయవ్యవస్థ, సాధారణ పరిపాలన విభాగం, సమాచార, ప్రచార శాఖలను కూడా నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు అర్బన్ డెవలప్‌మెంట్, హౌసింగ్ అండ్ పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్) శాఖను కేటాయించగా, అజిత్ పవార్‌కు ఫైనాన్స్, ప్లానింగ్, స్టేట్ ఎక్సైజ్ శాఖలు కేటాయించారు.