Ranveer Allahbadia: ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇతను చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు ఇతడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్‌ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్‌నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో…
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి.
No Parking Space- No Car: రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేయడానికి మహారాష్ట్ర సర్కార్ కొత్త ప్రతిపాదనను తెచ్చింది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే రూల్ అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు.
Sanjay Raut: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అజిత్ పవార్, శరద్ పవార్ కలిపోతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, బీజేపీ సర్కార్ అంటేనే విరుచుకుపడే శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు.
నూతన సంవత్సరం వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం జరిగింది. గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట తారక్క సిదాం సహా 11 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు అహల్యా నగర్లో సీనియర్ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నా హజారేతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ అన్నా హజారేతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా ఉన్నారు. సీఎం దేవేంద్ర తన సోషల్ మీడియా హ్యాండిల్లో దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోను పంచుకున్నారు.