ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది.
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్‌పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
శివసేన, సేన పోరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ శుక్రవారం అన్నారు.
Maharashtra Political Crisis: మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్‌గా నియమిస్తూ హౌస్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది.
మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేసిన ప్రకటనపై మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అజిత్ పవార్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, అయితే అందరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు.
మహారాష్ట్రలోని అకోలాలో ఆదివారం ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. అకోలా జిల్లాలోని పరాస్‌లో మతపరమైన వేడుకల కోసం కొంతమంది గుమిగూడిన సమయంలో టిన్ షెడ్‌పై చెట్టు పడి కొందరు భక్తులు మృతి చెందారు.
Maharastra: ఎట్టకేలకు మహారాష్ట్ర ఆధిపత్య పోరుకు తెరపడింది. ఆ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.