Sanjay Raut Praises BJP's Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత…
ఐదేళ్లపాటు కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సమాజంలో హింసకు బీజం వేస్తోందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం అన్నారు. సైలెంట్ కిల్లర్‌లా పుకార్లు వ్యాప్తి చేస్తూ హింసను ప్రేరేపించడమే పీఎఫ్‌ఐ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది.
Devendra Fadnavis comments on uddhav thackeray: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఫడ్నవీస్ ను ఠాక్రే ఎప్పుడూ అంతం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి నన్ను అంతం చేయాలని చూశారు.. అది మీల్ల కాలేదు అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఫోటో చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఆ తరువాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్, ఎన్సీపీలతో…
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ఫేస్‌బుక్ పేజీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు 50 ఏళ్ల మహిళను సైబర్ పోలీసు విభాగం మంగళవారం అరెస్టు చేసింది.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే సమయంలో చెల్లుబాటు అయ్యే అంశాలను లేవనెత్తారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న ఓడ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.