Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
Yogi Adityanath: దేశం మొత్తం ప్రస్తుతం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై చాలాా చర్చ నడుస్తోంది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18-22 వరకు నిర్వహించడం.. తాజాగా ఈ రోజు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చీఫ్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ని నియమించింది.
Uddhav Thackeray: భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు ఐపీఎల్ లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ రోజు బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే ఖండించారు. రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలో ఉండవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ప్రాథమికంగా 200కి చేరుకోవడంతో గత 51 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక ప్రత్యేక దృశ్యం ఆవిష్కృతమైంది.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన 2019 ప్రయోగం విఫలమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం అన్నారు.
Devendra Fadnavis: భారతదేశంలోని ముస్లింలు ఎవరూ ఔరంగజేబ్ కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలు ఎవరూ కూడా మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా గుర్తించరని మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగబాద్ లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్
Devendra Fadnavis: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్, హెడ్గేవార్ సిలబస్ ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. గతంలో బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులన్నింటిని రద్దు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,