మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేసిన ప్రకటనపై మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అజిత్ పవార్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, అయితే అందరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు.
మహారాష్ట్రలోని అకోలాలో ఆదివారం ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. అకోలా జిల్లాలోని పరాస్‌లో మతపరమైన వేడుకల కోసం కొంతమంది గుమిగూడిన సమయంలో టిన్ షెడ్‌పై చెట్టు పడి కొందరు భక్తులు మృతి చెందారు.
Maharastra: ఎట్టకేలకు మహారాష్ట్ర ఆధిపత్య పోరుకు తెరపడింది. ఆ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సర్కారు తమ మొదటి బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Maharashtra: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సొంత ఇలాకాలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్‌పూర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి చేతిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం నుంచి ఎంవీఏ బలపరిచిన అభ్యర్థి సుధాకర్ అద్బలే విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఉన్న…
CM Wife Song: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆమె గతంలో ఎన్నో వినసొంపైన పాటలను పాడారు.
Devendra Fadnavis announces SIT probe into Disha Salian's death: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసు ఇప్పటికే ముంబై పోలీసుల పరిధిలో ఉందని.. దీనిపై సిట్ ద్వారా విచారణ జరపుతాం అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ హత్యపై ఏమైనా ఆధారాలు…
Amruta Fadnavis termed Prime Minister Narendra Modi as Father of Nation: భారతదేశానికి ఇద్దరు ‘జాతిపిత’ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. ప్రధాని నరేంద్రమోదీని ‘ఫాదర్ ఆఫ్ నేషన్’గా అభివర్ణించారు. ఈ వారం నాగ్‌పూర్‌లో రచయితల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మహాత్మాగాంధీ ఏమవుతారని ప్రశ్నించగా.. మహాత్మాగాంధీ ‘జాతిపిత’ అని.. ప్రధాని నరేంద్ర…
మహారాష్ట్రలోని 11 గ్రామాలు ప్రాథమిక సౌకర్యాలపై కర్ణాటకలో విలీనాన్ని కోరుతున్నాయి. తమ ప్రాంతాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మంచినీటి వసతి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.