Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.
Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కోసం బీజేపీ అగ్రనేతలు క్యూ కడతారని ప్రచారం జరుగుతోంది.
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
Devendra Fadnavis Croons Pushpa Song Srivalli With Javed Ali At Mumbai Event: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప ది రైజ్’ ఫీవర్ విడుదలై ఏళ్ళు గడుస్తున్నా అభిమానుల్లో తగ్గడం లేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ప్రజల్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచేలా చూసి త్వరలో ఈ చిత్రానికి రెండో భాగాన్ని తీసుకురాబోతున్నారు పుష్ప టీమ్. తాజాగా సుకుమార్ పుష్ప్ 2: ది…
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
Yogi Adityanath: దేశం మొత్తం ప్రస్తుతం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై చాలాా చర్చ నడుస్తోంది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18-22 వరకు నిర్వహించడం.. తాజాగా ఈ రోజు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చీఫ్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ని నియమించింది.
Uddhav Thackeray: భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు ఐపీఎల్ లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ రోజు బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.