Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఔరంగజేబు సంతానం ఎక్కడ నుంచి వచ్చారు..? దీని వెనక ఎవరున్నారు..? దీనిని మేము కనుగొని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు సంతానం అని ఫడ్నవీస్ సంబోధించడాన్ని తప్పుపట్టారు. నాథురామ్ గాడ్సే, వామన శిమరామ్ ఆప్టే సంతానం ఎవరో తెలుసా..? అంటూ ఫడ్నవీస్ పై ఎదురుదాడి ప్రారంభించారు.
Read Also: Disney Hotstar: జియో బాటలోనే హాట్ స్టార్.. ఆ రెండు టోర్నీలను ఫ్రీగా చూసుకోవచ్చు..!
ఈ ఘర్షణలపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘‘ అకస్మత్తుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఔరంగజేబు సంతానం జన్మించింది. వారు ఔరంగజేబు స్టేటస్ పెట్టి, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారని, దీంతోనే కొల్హాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వారు ఎక్కడ నుంచి వచ్చారనే వివరాలను మేము కనుగొంటాం’’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మీరు అంత నిపుణులని తెలియదని.. గాడ్సే, ఆప్టే పిల్లలు కూడా ఎవరో తెలుసుకోవాలి’’ అంటూ సెటైర్లు వేశారు.
బుధవారం కోల్హాపూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. కొల్హాపూర్ ఘటనపై రాజకీయం అవసరం లేదని శరద్ పవార్ గురువారం అన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది ఇలాంటి పరిస్థితిన సృష్టించారు, ఇది సమాజానికి మంచిది కాదని, దీని వల్ల సామాన్యులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని శరద్ పవార్ అన్నారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా శాంతిభద్రతల పర్యవేక్షించారు. పోలీసులు విచారణ కొనసాగుతుందని, దోషులుగా తేలిని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.