Maharastra: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌పై సోషల్ మీడియా పోస్ట్‌లు.. రణరంగంగా కొల్హాపూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra: ఔరంగజేబ్ మరియు టిప్పు సుల్తాన్‌లపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌లపై మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరం అట్టుడికింది. హిందూ సంస్థలు ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. బంద్ కు పిలుపునిస్తూ ఆందోళన నిర్వహించారు. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ ఓ వర్గం వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ఔనత్యాన్ని కించపరిచేలా, మహారాష్ట్ర జాతీయ చిహ్నాన్ని అగౌరపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారని హిందూ సంస్థలు ఆరోపించాయి.
Read Also: Gangster Shot Dead: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..
Also Read
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
కొల్హాపూర్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద నిరసనకారులు కొన్ని దుకాణాలు మరియు వాహనాలను ధ్వంసం చేయడంతో నిరసన హింసాత్మకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పట్టణంలో ఇతర ప్రాంతాల్లో కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.
ఈ ఘర్షణలపై డిప్యూటీ సీఎం,హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఔరంగజేబ్‌ను పొగిడేవారికి మహారాష్ట్రలో క్షమాపణ లేదు. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో శాంతిభద్రతలు కాపాడటం మా సమిష్టి బాధ్యత అని అన్నారు. సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ ఘటనపై ఆరా తీశారు.. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ‘మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఔరంగజేబు పిల్లలు అకస్మాత్తుగా కనిపించారు. వారు ఔరంగజేబు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి సమాజంలో చెడును కలిగిస్తాయి. ఈ ఘటన వెనక ఎవరున్నారనేది తెలుస్తుందని’ దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
తాజావార్తలు
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!