ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది.
Earthquake in Delhi NCR: గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Delhi Liquor Case: లిక్కర్ కేసు సిబిఐ చార్జ్ పై ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగింది. లిక్కర్ కేసు సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణను సెప్టెంబర్ 11 వ తేదీన జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు.
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది.
Crime: ఆవేశంతో 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని రోహిణిలో జరిగింది. తండ్రిని హత్య చేసినందుకు బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. బాలుడు తన తండ్రి తలపై ప్లాస్టిక్ పైపుతో కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ఓ మైనర్ తన తండ్రిని పైపుతో కొట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న 50 ఏళ్ల వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ హస్తినకు చేరుకున్నారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఢిల్లీకి వచ్చారు. కమలం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జేఎంఎంలో తనకు ఘోరమైన అవమానం జరిగిందని చంపై సోరెన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లబుచ్చారు.