భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.
PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్…
Best Teacher Awards: ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024కు ఎంపిక చేసిన 82 మంది అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డులను ప్రధానం చేయబోతున్నారు.
Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ విమర్శించారు.
చైనా, పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టిన మాజీ సైనికుడిని కొట్టి చంపాడు. 93 ఏళ్ల వృద్ధుడు తన మనవడికి పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మనవడు తాతను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. గోవింద్పురిలో ఐదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని బాలుడు.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత కొద్ది రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో నిందితుల ఇళ్లపై బుల్డోజర్లతో ఆస్తులను ధ్వంసం చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. సోమవారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బుల్డోజర్ చర్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సమయంలో.. ప్రధాని మోడీ బీజేపీలో మరోసారి సభ్యత్వం తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఢిల్లీలోని ఐదుగురు కౌన్సిలర్లలో ఒకరైన కౌన్సిలర్ రామచంద్ర ఈరోజు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితం ఆప్ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని మాయ చేసిన బీజేపీకి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.