సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసారు. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌కి తన రాజీనామాను సమర్పించారు. అతిషి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు. అయితే ప్రమాణ స్వీకార తేదీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి తేదీని ప్రకటించలేదు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనుండటంతో అతీషీ కొత్త కేబినెట్‌గా మారనుంది. కొత్త కేబినెట్‌లో పాత ముఖాలందరికీ అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. అతిషి ముఖ్యమంత్రి కానుండటంతో అందులో ఇద్దరు కొత్త ముఖాలు చేరనున్నాయి. కొత్త మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాలను పరిష్కరించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది. కాగా.. షెడ్యూల్డ్ కులాల సభ్యుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉండగా… రెండవది పూర్వాంచల్‌తో సహా మరే ఇతర ప్రాంతం నుండి ఒకరికి దక్కవచ్చని చెబుతున్నారు.
Mallikarjuk Kharge: జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావు.. సమస్యలను పక్కదారి పట్టించేందుకే..!
రేసులో ఉన్న పేర్లు ఇవే:
ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా లేరని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత మంత్రులకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన రెండు మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సోమనాథ్ భారతి, దుర్గేష్ పాఠక్, సంజీవ్ ఝా, దిలీప్ పాండే, మహేంద్ర గోయల్ జనరల్ సీటుపై మంత్రి రేసులో ఉన్నారు. మరోవైపు.. కులదీప్ కుమార్, విశేష్ రవి, గిరీష్ సోనీలు ఎస్టీ కోటా నుంచి మంత్రుల రేసులో ఉన్నారు. కాగా.. ఢిల్లీ కేబినెట్‌కు సంబంధించి గురువారం నాటికి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే.. రాష్ట్రపతి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. శుక్రవారం కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
తొలి కేబినెట్‌లో మహిళా సమ్మాన్ యోజన:
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అతిషి నేతృత్వంలో ఏర్పాటవుతున్న ఢిల్లీ ప్రభుత్వ తొలి మంత్రివర్గంలో… ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది. అక్టోబరు మొదటి వారంలో కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనపై ప్రముఖంగా చర్చించనున్నారు. ఈ పథకం కోసం ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఉద్యోగం చేస్తున్న లేదా ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్న మహిళలు ఈ పథకం ప్రయోజనం పొందలేరు. అంతే కాకుండా.. ఢిల్లీ జల్ బోర్డు యొక్క బిల్లు మాఫీ పథకం సహా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నారు.