ఢిల్లీలోని ఎయిమ్స్, అపోలో సహా పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, సర్ గంగారాం వంటి పెద్ద, ప్రఖ్యాత ఆసుపత్రులకు ఏకకాలంలో బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి.
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు.
Delhi Crime: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి తెగబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో, మరో స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద నాటకానికి తెరతీసింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కన్న కూతురే నిందితురాలిగా తేల్చారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఆదివారం వాయువ్య దిశగా పయనించనుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు.
Vijayawada Airport: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటలో తన ప్రసంగంలో ప్రతిసారీ.. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమి చేయబోతుందో సూచనలు ఇస్తూనే ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో…