Building Collapses in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిపోయింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం ఈరోజు (బుధవారం) కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని పోయారు. ఇక, సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ టీమ్స్ కూడా పాల్గొన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఏడుగురిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి. కాగా, ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగానే ఈ బిల్డింగ్ కుప్పకూలినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో భారీ వర్షాల వల్ల పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిథిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Delhi | A house collapsed in Karol Bagh area. A total of 5 fire tenders rushed to the site. Some portion of the building collapsed and some persons are suspected to be trapped under the debris. Further details awaited: Delhi Fire Services
(Source: Delhi Fire Services) pic.twitter.com/7NbRmqn2yN
— ANI (@ANI) September 18, 2024