Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..
- పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి నేరస్థుడు మృతి
- ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకిన వ్యక్తి
- ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక నేరస్థుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసుకుని.. ఓ నేరస్థుడు ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. మృతుడు జాకీర్ అలియాస్ సోనుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Read Also: Damodar Raja Narasimha: చవకబారు విమర్శలు మానుకోండి.. దామోదర రాజనర్సింహ ట్విట్
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఢిల్లీ తూర్పు ప్రాంతంలో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ఇర్ఫాన్ అలియాస్ చేను నడుపుతున్న ముఠాలో అతడు సభ్యుడిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు నిందితులు అఫ్సర్, నదీమ్, అబిద్, షోయబ్‌లతో కలిసి గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా షాహదారా ఫ్లైఓవర్ వద్ద సోనూ పట్టుబడ్డాడు.
Read Also: CM Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. టీటీడీ ఈవోకు కీలక ఆదేశాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు బృందం అతనిని పట్టుకునేందుకు చూస్తోంది. ఈ క్రమంలో.. జాకీర్ తప్పించుకోవడానికి ప్రయత్నించి ఫ్లైఓవర్ నుండి దూకాడు. దూకుతున్న సమయంలో చెట్టు కొమ్మను పట్టుకునేందుకు ప్రయత్నించగా చేయి జారి రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అతన్ని జిటిబి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మరోవైపు.. నలుగురు నిందితుల నుంచి ఒక ఆస్ట్రియన్ మేడ్ రివాల్వర్, ఏడు రౌండ్ల లైవ్ కాట్రిడ్జ్‌లు, 30 బోర్ పిస్టల్స్, మూడు కంట్రీ మేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించామని.. తదుపరి విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!