ఆరావళి పర్వత శ్రేణులపై గతంలో ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సవరించింది. మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించకూడదని గతంలో ఇచ్చిన తీర్పుపై తాజాగా న్యాయస్థానం స్టే విధించింది. నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా నిలిపివేసింది. మునుపటి కమిటీలో నిపుణుల కాకుండా.. అధికారులే ఎక్కువగా ఉన్నారని అభిప్రాయపడింది. తదుపరి విచారణ జనవరి 21కు వాయిదా వేసింది.
ఢిల్లీలోని ఇందిరా భవన్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు.
న్యూఇయర్‌కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద 285 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా నేరాల్లో నిందితులుగా పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రశ్నాపత్రం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షలో అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. వివాదానికి కారకుడైన ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్‌పీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.
ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్‌కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
ప్రధాన సమాచార కమిషనర్‌గా (సీఐసీ) రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాజ్ కుమార్ గోయల్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు హజరయ్యారు.
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి, 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోసారి కొనసాగించాలంటే పార్లమెంట్ లేదా ఎన్నికల సంఘం ఆమోదం అవసరం ఉంటుంది.