Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఈ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇటీవలే కేంద్రం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. కేంద్రమంత్రులు కూడా ప్రకటనలు చేశారు. అన్నట్టుగానే బుధవారం మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం కోవింద్ నివేదికకు ఆమోదముద్ర వేసింది.
ఇది కూడా చదవండి: Jagdaur CHC: పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు చేశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఇటీవలే కాంగ్రెస్, వామపక్షాలు స్పష్టం చేశాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని.. అందుకు లోక్‌సభలోనూ.. రాజ్యసభలోనూ మోడీ ప్రభుత్వానికి బలం లేదని స్పష్టంచేశాయి. కానీ కేంద్రం మాత్రం జమిలి వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై విపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
జమిలి అంటే ఏంటి?
లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించడాన్ని జమిలి అంటారు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలకు ఆయా సమయాల్లో జరుగుతున్నాయి. ఈసారి మాత్రం కొన్ని నెలలు గ్యాప్ ఉన్న రాష్ట్రాలను కూడా లోక్‌సభ ఎన్నికల దాకా పొడిగించవచ్చు. అందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీల గడువును పొడిగించి లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్రాలకు ఆపధర్మ ప్రభుత్వాన్ని నడపడానికి రాజ్యాంగంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే.. ఈ రాష్ట్రాల్లో కూడా లోక్‌సభతో పాటు నిర్వహించే ఛాన్సుంటుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!