ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం-లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఎల్జీ తీసుకున్న నిర్ణయంతో ఆ జ్వాలలు మరింత రేకెత్తిస్తున్నాయి.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది.
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. 30.08.2024 నుంచి రెండు సంవత్సరాల పదవీకాలంతో కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్ కొనసాగనున్నారు. సోమనాథన్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. వర్షపు నీటితో నిండిన చెరువులో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బజరంగ్ బలి ఆశీస్సులు తనపై ఉన్నాయన్నారు. ఆయన ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చాను.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కూడా హనుమాన్ ఆశీస్సులు ఉన్నాయని, తనలానే సీఎం కూడా తొందరలోనే జైలు నుంచి రిలీజ్ అవుతారని సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు.
Delhi Deputy CM Post: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్పై రిలీజ్ కావడంతో ప్రస్తుతం కొత్త వాదనకు తెరలేచింది.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై పది హేడు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి రిలీజైన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం స్టార్ట్ చేశారు.
Delhi Rain: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలతో వీకెండ్ స్టార్ట్ అయింది. గురువారం నుంచి ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిస్తే.. శుక్రవారం సాయంత్రం నుంచి పడుతున్న వాన ఢిల్లీ-ఎన్సీఆర్లోని జనానికి కాస్తా రిలీఫ్ ఇచ్చింది.