మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి షిండేతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య పోరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేకి అని అజయ్ మాకెన్ అనడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది.
ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది.
భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీకి చెందిన వివాదాస్పద నవల ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు దాదాపు 36 ఏళ్ల నిషేధం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని బహ్రిసన్స్ బుక్స్టాల్లో ప్రత్యక్షమయ్యాయి.
Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యాంగం, బాబా సాహెబ్ అంబేడ్కర్, రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు పరస్పరం దళిత వ్యతిరేకులుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో 'రాజ్యాంగం ఎవరు రాశారో వారు మద్యం తాగి రాసి ఉంటారు' అనే కేజ్రీవాల్ చెప్పినట్లు ఉంది.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర అనుమానిత బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో బీజేపీ శ్రేణులు పోలీసులకు సమాచారం అందించారు.