Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
- దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని..
- గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయి..
- కేంద్ర పథకాలతో గ్రామీణ భారతంలో పేదరికం తగ్గింది: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025 కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు. ఫలితంగా పట్టణాల్లోనూ పేదరికం పెరిగిపోయిందన్నారు. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల..
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
అలాగే, దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. సమాజ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలే గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక, మారుమూల గ్రామాల ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు సమ్మిళిత ఆర్థిక విధానాలు అవసరం. ఇక, కరోనా సమయంలో భారత్‌లోని మారుమూల గ్రామల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Jagan Mohan Reddy: ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారన్న జగన్
ఇక, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో దేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఆసుపత్రులను మారుమూల గ్రామాలకు అనుసంధానం చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. గ్రామాలలోని ప్రజలు ప్రస్తుతం టెలీమెడిసిన్ సౌకర్యాలను పొందుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, పల్లెల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు, మౌలిక వసతులు అందిస్తున్నాం.. పీఎం-కిసాన్ పథకం ద్వారా, రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తుంది.. అలాగే, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల వల్ల గ్రామీణ భారతంలో పేదరికం దాదాపు 26 శాతం నుంచి 5 శాతానికి తగ్గిపోయిందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!