Cars24 CEO: కన్నడ అంటే ఆ కర్ణాటకలోని ప్రజలకు ఎంత అభిమానమో అందరికి తెలుసు. అయితే, ఇది ఇటీవల కాలంలో దురభిమానంగా మారుతోంది. వేరే ప్రాంతాల నుంచి బెంగళూర్, ఇతర కర్ణాటక ప్రాంతాల్లో పనిచేసే వారు తప్పకుండా కన్నడ మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కన్నడ మాట్లాడని వారిపై దాడులు చేస్తున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం నుంచి హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నవంబర్ 25న ప్రారంభమైన సమావేశాలు ఏ రోజు సాఫీగా సాగలేదు.
మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌కు రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇది గతంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్గ్రేడ్లు కూడా చేశారు. దాని వివరాలను తెలుసుకుందాం.
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్ర నేత ఎల్కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. పయ్యావుల కేశవ్ వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.. రాష్ట్ర బడ్జెట్ ను ఇటీవలే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే కాగా.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి నిర్మల సీతారామన్ ను కలిశారు పయ్యావుల కేశవ్..
భార్యాభర్తల సంబంధం రోజురోజుకు దిగజారిపోతుంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. మధ్యలో పెడదారిన పడుతున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. క్షణిక సుఖం కొందరు అడ్డదారులు తొక్కి.. మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్‌ను తగిలించుకుని హల్చల్ చేశారు.
Today Gold and Silver Rates: గత కొద్దీ కాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు భారీగా తగ్గి ఆ తర్వాత రెండు రోజులు స్థిరంగా కొనసాగింది. అయితే , నేడు (మంగళవారం) దేశ వ్యాప్తంగా స్వల్ప పెరుగుదల కనిపించింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై…
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిల్చున్న వారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. క్షణాల్లో దూసుకురావడంతో హడలెత్తిపోయారు. మనవడితో నడుచుకుంటూ వెళ్తు్న్న వ్యక్తిని ఢీకొట్టింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' అమలును ఇటీవలే ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. ఒక సర్వేను ఉటంకిస్తూ, ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారని, 40 శాతం మంది తనకు అనుకూలంగా లేరని అన్నారు.