ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటించాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Wedding: పెళ్లిలో ఇద్దరు కుమార్తెలతో తల్లి డ్యాన్స్.. వీడియో వైరల్
ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. దౌత్యమార్గాల ద్వారా భారత్, పాకిస్థాన్ తమ అణు స్థావరాల జాబితాను పంచుకున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపింది. కశ్మీర్ సమస్యతో పాటు సీమాంతర ఉగ్రవాదంపై కూడా రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగింది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 34వ సారి అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Bangladesh: ఇండియాతో సంబంధాలపై బంగ్లా ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
1988 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ అణు స్థాపనలు, సౌకర్యాలపై దాడి నిషేధం ఒప్పందం మీద సంతకం చేశాయి. ఇది 1991 జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది. 34 ఏళ్లుగా ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశం, పాకిస్తాన్ ప్రతి జనవరి మొదటి తేదీన ఒప్పందం పరిధిలోకి వచ్చే అణు సంస్థాపనలు, సౌకర్యాల గురించి పరస్పరం తెలియజేసుకుంటాయి.
ఇది కూడా చదవండి: UP: అయోధ్య, వారణాసి ఆలయాల్లో న్యూఇయర్ రద్దీ.. కొన్ని గంటల్లోనే రికార్డ్ దర్శనం