నేటి బాలలే.. రేపటి పౌరులు అన్నారు పెద్దలు. ఇక బాలురు అంటే అంతగా మెచ్యూరిటీ ఉండదు. తెలిసీతెలియని వయసు. మంచేదో.. చెడేదో తెలియని వయసు. ఇదంతా ఇప్పుడెందుకంటారా? దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పాఠశాలలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఏడో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ వయసులో విద్యార్థులు హంతకులుగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చేజేతులారా బాల్యంలో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. దీంతో నేటి తరం పిల్లల ఆలోచన విధానంపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Best Selling Car: డిసెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్‌లో ఏది ఉందో తెలుసా?
సోషల్ మీడియా ప్రపంచంలో నేటి తరం పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్న తనం నుంచి మొబైల్‌కు బానిస కావడం. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌తో పిల్లలు వికృతంగా మారిపోతున్నారు. భవిష్యత్‌కు మంచి పునాదులు వేసుకోవల్సిన వయసులో.. నేరాల బాట పడుతున్నారు. దీనింతటికీ కారణం సోషల్ మీడియానే కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం జరిపిన సర్వేలో కూడా ఇదే తేలింది. దీంతో అక్కడ.. పిల్లలు సోషల్ మీడియా వైపు వెళ్లకుండా చట్టాన్ని చేసింది. త్వరలో ఇండియాలో కూడా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Minister Seethakka: ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు..
శుక్రవారం తూర్పు ఢిల్లీలోని రాజ్‌కియ సర్వోదయ బాల విద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న ఇషు గుప్తా.. కృష్ణ అనే విద్యార్థితో గొడవ పడ్డాడు. పాఠ్యేతర కార్యకలాపాల సమయంలో ఘర్షణ జరిగింది. అంతే ఇషు గుప్తాపై కృష్ణ పగ పెంచుకున్నాడు. ఎప్పటి నుంచి ప్లాన్ వేశాడో తెలియదు గానీ.. చంపేయాలని కసితో రగిలిపోయాడు. ఇంకేముంది మరి కొందరి స్నేహితులను పాఠశాలకు రప్పించాడు. పాఠశాల అయిపోయాక బయటకు వచ్చిన ఇషు గుప్తాతో కృష్ణ గొడవపెట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన స్నేహితులు కత్తితో దాడి చేశారు. కుడి కాలుపై భారీ గాయం కావడంతో ఇషు గుప్తా కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది స్పందించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల సమయంలో బాధితుడు ఇషు గుప్తా-కృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. అనంతరం స్నేహితుల సహకారంతో కృష్ణ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బాధితుడి కుడి తొడపై కత్తితో పొడవడంతో ప్రాణాంతకమైందని పోలీసులు పేర్కొన్నారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మైనర్లు, మరో ఇద్దరు 19, 21 ఏళ్ల వయసున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారి వెల్లడించారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Shyamala: సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం..? శ్యామల సెటైర్లు..