Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fog: వేసవి కాలం మధ్యలోనూ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా రాజమండ్రిలో ఉదయం వేళ గోదావరి నదిపై విస్తరించిన దట్టమైన పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. గోదావరి నదిపై ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి, హేవలక్ బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి పొగమంచుతో పూర్తిగా కప్పుకుపోయాయి. దీంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది.
Read Also: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
Also Read
ఇక, ఉదయం గోదావరి ఘాట్లకు వెళ్లే భక్తులు, అలాగే గోదావరి బండపై వాకింగ్ చేసే వారు ఈ అరుదైన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా శీతాకాలంలో కనిపించే పొగమంచు, వేసవిలో కూడా ఇలా కమ్ముకోవడం అరుదైన విషయమని వారు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉదయం 7 గంటలైనప్పటికీ పొగమంచు పూర్తిగా తొలగకపోవడం గమనార్హం. దీనివల్ల కొంతసేపు ట్రాఫిక్ కూడా నెమ్మదించింది. పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగానే ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, తేమ శాతం పెరగడం వంటి కారణాల వల్లే వేసవిలో కూడా పొగమంచు ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!