నూతన సంవత్సరం వేళ అన్నదాతల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.1350కే 50 కిలోల డీఏపీ ఎరువు బస్తా అందజేయాలని నిర్ణయం తీసుకుంది. డీఏపీ ఎరువులపై అదనపు భారం కేంద్రమే భరించాలని నిర్ణయం తీసుకుంది. డీఏపీ ఎరువుల సబ్సిడీకి రూ.3,850 కోట్లు కేటాయించింది. 2014-24 వరకు ఎరువుల సబ్సిడీకి రూ.11.9 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇక 2024లో మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కోసం రూ. 6 లక్షల కోట్లతో 23 కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోసారి రైతుల కోసం కొత్త సంవత్సరం వేళ తీపికబురు చెప్పింది.
బుధవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. న్యూఇయర్ వేళ రైతుల కోసం ప్రత్యేకంగా మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్త సంవత్సరంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.1350కే 50 కిలోల డీఏపీ బస్తా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొ్న్నారు. అలాగే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మార్పులు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రూ.69,515 కోట్లకు పెంపు పెంచినట్లు చెప్పారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ.800 కోట్లు కేటాయించారు. సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడనుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: New Year Celebrations: మోత మోగించిన రైల్వే అధికారులు.. రైల్వే స్టేషన్‌లో వెరైటీగా వేడుకలు