Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలిగాలులతో దృశ్యమానత తగ్గింది. ఈరోజు (జనవరి 4) ఉదయం రన్‌వేపై దృశ్యమానత సున్నాగా ఉండటంతో విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసినందున ఢిల్లీ ఎయిర్ పోర్టులో 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 30 విమానాలు రద్దు చేయబడ్డాయి.
Read Also: Off The Record: పిలుపే ఇస్తారా..? వైసీపీ నిరసన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారా..?
అలాగే, కోల్‌కతా విమానాశ్రయంలో దాదాపు 25 విమాన సర్వీసులపై పొగ మంచు ప్రభావం పడింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియాతో సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందజేశాయి. దట్టమైన పొగమంచు కారణంగా పేలవమైన దృశ్యమానత కలిగి ఉంటడం వల్ల ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది అని వెల్లడించారు. ప్రస్తుతం ఏ విమానాన్ని కూడా మళ్లించలేదని తెలిపారు. మరోవైపు, ఈ పొగమంచు కారణంగా రైలు షెడ్యూల్‌లుతో పాటు రోడ్లపై కూడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీని వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.