మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు.
అమెరికా వీసాల్లో రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
క్రిస్మస్ రోజున పార్లమెంట్ భవనం సమీపంలో ఆత్మాహత్యాయత్నం చేసిన 26 ఏళ్ల జితేంద్ర అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రిలో చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు.. కానీ, ఆయన భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.. మన్మోహన్ లేని…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వయో భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆర్థిక వేత్తగా మన్మోహన్ అనుసరించిన విధానాలను నేతలు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ప్రముఖులు నివాళులర్పించారు.
ఈరోజు (డిసెంబర్ 27) ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Manmohan Singh Passes Away Live Updates: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటినా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో మన్మోహన్‌కు చికిత్స అందిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.