తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిందా.. రాష్ట్రం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా.. కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే, వాళ్లు ఎక్కువ ఇచ్చినట్లు చూపెడితే.. నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తానని ఓపెస్ చాలెంజ్ విసిరారు..
తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్‌కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
శుక్రవారం భారీగా పెరిగి ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయని తెలిసిన విషయమే. ఈ నేపథ్యం బంగారం ధరలు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 వరకు ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 47,450 కాగా.. 24 క్యారెట్ల…
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు కేటీఆర్.. హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్‌కు ఆర్థిక సహాయం అందించాలని, హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు
వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైన తరుణంలోనే ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2, 3 తేదాల్లో జరిగే సమావేశాల ఏర్పాట్లలో ఈటలకు కూడా బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ.. కొన్నాళ్లుగా బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో మాజీ మంత్రి ఉన్నట్టు టాక్. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారనే ఫీలింగ్‌లో ఉన్నారట. బీజేపీలోని కొందరు నాయకుల వైఖరి పట్ల కినుకతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో బీజేపీలో ఈటల…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా.. దాదాపు వారం తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్.. ఈ సాయంత్రం సర్ గంగారామ్ ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారని మరియు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు…
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం కనిపించింది. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కొవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర…
రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్నిపధ్” పధకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” దీక్షకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దు కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” దీక్ష ప్రారంభం కానున్న సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా భారీ…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఇవాళ గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీక్ష వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి…