* అగ్నిఫత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నేడు అగ్నిపత్ పథకంపై ఇవాళ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష * ఇవాళ, రేపే హైదరాబాధ్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు * నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీడబ్ల్యూసీ బృందం * ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల * అగ్నిపథ్‌పై ఆందోళనలు, విధ్వంసం నేపథ్యంలో బీహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ * నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, నాగర్ కర్నూల్,…
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఈ దాడులు జరిగాయి. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం-2002 కింద ఈ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న కూడా సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు దాడులు చేసి రూ.2.85 కోట్ల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్న…
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఫోర్త్ వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ఫిబ్రవరి నుంచి దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు లోపే నమోదు అయ్యేది. తాజాగా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. రోజూవారీ కేసులు 7 వేలు, 8 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడిచిన 24…
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆఫీసుకి విచారణ కోసం రాహుల్ గాంధీ ఈరోజు కూడా వచ్చారు. గత రెండురోజులుగా గంటల కొద్దీ విచారణ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి, బస్సులలో వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు పోలీసులు.’మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని కాంగ్రెస్ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండటం, అలాగే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం అవనుండటంతో… హస్తినలో జరిగే రాజకీయ పరిణామాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి… నేడు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించింది. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు- రాహుల్ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22…