ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నేతలు ఢిల్లీ బాట పట్టారు.. విషయం ఏదైనా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు.. ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు టీడీపీ ఎంపీలు.. మొదట ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం 12.15 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ తో మర్యాదపూర్వకంగా భేటీకానున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి టీడీపీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.. మరోవైపు.. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుండగా.. ఆ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు… తిరిగి రాత్రి 8.15 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు.
Read Also: Andhra Girl Married American Guy: ఖండాంతరాలు దాటిన ప్రేమ… అమెరికా అబ్బాయితో తిరుపతి యువతి పెళ్లి..
ఇక, ఇవాళ రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.. సమావేశం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం కానున్న ఆయన.. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, తన ఢిల్లీ పర్యటనలో సీఎం ఇంకా ఎవరైనా కలుస్తారా? రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు.. సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అయితే, ఒకేరోజు ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నా.. వైఎస్ జగన్ ఢిల్లీలో ల్యాండ్ కాకముందే.. చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు.