Delhi: పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌పై రౌడీ మూక దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: సాధారణంగా ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్‌కు పరిగెడతారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకుంటారు. కానీ పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటి?. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఈ అనుమానాలను రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఓ అల్లరి మూక ఏకంగా ఆనంద్ విహార్ పోలీసు స్టేషన్‌లోకి చొరబడి కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడింది. కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నప్పటికీ.. తోటి పోలీసులు చోద్యం చూడటం గమనార్హం. కానిస్టేబుల్‌పై దాడి చేయడం.. తనను విడిచిపెట్టమని ఆ కానిస్టేబుల్ చేతులెత్తి వేడుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. అడ్డుకోకుండా పోలీసులే ఈ దాడిని వీడియో తీయడం విస్మయానికి గురిచేస్తోంది.
Honeymoon Record: పదేళ్లు.. 65 దేశాలు.. హనీమూన్‌లో రికార్డు సృష్టిస్తున్న జంట
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
స్టేషన్‌లోకి 10, 12 మంది వ్యక్తులు ప్రవేశించి.. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. అయితే అక్కడున్నవారు ఎవరూ దానిని ఆపేందుకు ప్రయత్నించలేదు. దాంతో ఆ కానిస్టేబుల్ చేతులెత్తి.. తనను విడిచిపెట్టమని కోరాడు. అయినా సరే ఎవరూ కనికరించలేదు. ఈ అవమానకరమైన సంఘటన ఆగస్ట్ 3వ తేదీన జరిగినట్టు తెలుస్తుంది. ఆ బాధితుడు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్‌గా తెలుస్తుంది. వీడియోలు వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఈ విషయాన్ని వారు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు శనివారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తి సతీష్ కుమార్ (29) ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కర్దూమా నివాసి. సతీష్ వృత్తిరీత్యా న్యాయవాది అని వెల్లడించారు.
अंधेर गर्दी है दिल्ली में, #DelhiPolice #Delhi pic.twitter.com/JfBLNdNuIM
— Dhananjay Singh (@KunwarDJAY) August 6, 2022
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!