Dasoju Sravan Joins BJP: దాసోజు శ్రవణ్ నేడు కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఇవాళ ఉదయం బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ కు కసాయం కండువాకప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వెదిరె శ్రీరాంలతో కలిసి దాసోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
read also: Common Wealth Games 2022: స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన భవినా పటేల్
ఈనేపథ్యంలో.. ఆగస్టు 5న కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు తుంగలో తొక్కి రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్, మనిక్కం ఠాగూర్, సునీల్ ముగ్గురు కుమ్మక్కయ్యారన్నారు. ఇద్దరు రేవంత్ కు తాబేధారులు అయ్యారని విమర్శించారు. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మాణిక్కం ఠాగూర్, సునీల్‌లు రేవంత్ తప్పులపై మాట్లాడడం లేదని, రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీపీసీసీ లో సొంత ముఠాను రేవంత్ ను తయారు చేశారని మండిపడిన విషయం తెలిసిందే.