Coins worth Rs 11 crore missing: బ్యాంకులో చిల్లర మాయం.. రంగంలోకి సీబీఐ.. 25 ప్రాంతాల్లో సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో చిల్లర మాయమైంది.. రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. ఏకంగా 25 ప్రాంతాల్లో సోదాలు జరిపింది.. చిల్లర మాయం కావడం ఏంటి? ఆ కేసులో సీబీఐ ఎంట్రీ ఇవ్వడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. చిల్లర అంటే.. పావులో.. పరకో కాదండి.. ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణెలు గల్లంతయ్యాయి.. అది కూడా బ్యాంకులో నుంచి.. దీంతో, సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది..
Read Also: Power Purchases Telangana: డిస్కంలపై నిషేధం.. రాష్ట్రాల్లో కరెంట్ కోతలు..?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
రాజస్థాన్‌లోని కరౌలీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. తాజాగా, అంటే గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఏజెన్సీ.. ఏప్రిల్ 13న కేసు నమోదు చేసిందని వారు తెలిపారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయపూర్ మరియు భిల్వారాలోని 25 ప్రాంతాల్లో ఏకకాలంలో.. 15 మంది మాజీ బ్యాంకు అధికారులు మరియు ఇతరుల ప్రాంగణాల్లో సోదాలు జరిపినట్టు వెల్లడించారు.. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్.. ఆగస్టు 2021లో తన నగదు నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. తర్వాత డబ్బు లెక్కింపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ లెక్కింపులోనే అసలు విషయం వెలుగు చూసింది. కౌంటింగ్‌ను ఓ ప్రైవేట్ వెండర్‌కు అప్పగించగా, బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైనట్లు తేలింది. దాదాపు రూ. 2 కోట్లతో కూడిన 3,000 నాణేల సంచులకు మాత్రమే లెక్కలు చూపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నాణేల శాఖకు బదిలీ చేశారు. మిగతా చిల్లర ఎటు పోయింది అని తేల్చేపనిలో సీబీఐ పడిపోయింది.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!