మునుగోడు వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం.. కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చింది.. అయితే, నష్ట నివారణ చర్యలకు దిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. చండూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. మునుగోడు నియోజకవర్గ స్థాయి ఈ సభ.. సాయంత్రం 4 గంటలకు చండూర్‌లో ప్రారంభం కాబోతోంది.. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సభకు హాజరు అవుతారా? కారా? అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.. ఆయన ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నారు.. ఇక, మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కావడానికి సిద్ధం అయ్యారు. వరదల వల్ల తెలంగాణలో జరిగిన నష్టంపై అమిత్ షాను కలుస్తారని చెబుతున్నారు. అసలే సోదరుడి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా సాగుతుండగా.. వెంకట్‌రెడ్డి.. అమిత్‌షా దగ్గరకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also:Gorantla Madhav Video Call Leak Issue: గోరంట్ల మాధవ్ రాజీనామాకు టీడీపీ నేతల డిమాండ్..
అయతే, గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా అమిత్‌షాతో రహస్యంగా భేటీ అయ్యారు.. ఆ తర్వాత అది బయటకు పొక్కింది.. ఇక, పార్టీకే రాజీనామా చేశారు. ఇలాంటి సమయంలో వెంకట్‌రెడ్డి.. షా దగ్గరకు వెళ్లడం చర్చగా మారింది.. అయితే, స్పష్టమైన నిర్ణయం తీసుకోనేందుకు వెంకట్‌రెడ్డి సిద్ధంఅవుతున్నట్టు టాక్ నడుస్తోంది.. మునుగోడు ఉప ఎన్నికలో “అంతరాత్మ ప్రబోధం” అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందట.. తెలంగాణ రాజకీయాలను మునుగోడు ఉప ఎన్నిక మలుపు తిప్పుతుందనే చర్చ సాగుతోంది.. నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలతో పాటు, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.. లేదా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలాఖరులోనే మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు..
మునుగోడు ఉప ఎన్నికలో “ఆంతరాత్మ ప్రబోధం” మేరకు ఓటు వేయాలని మద్దతుదారులకు, శ్రేయోభిలాషులకు, అనుచరలకు పిలుపునివ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. 1969లో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న నీలం సంజీవరెడ్డి ని ఓడించేందుకు ఇందిరా కాంగ్రెస్ ( కాంగ్రెస్-ఐ) అధినేత్రి ఇందిరా గాంధీ కాంగ్రెస్ వాదులకు ఇచ్చిన పిలుపు “ఆంతరాత్మ ప్రబోధం”… రాజకీయాల్లో 70 దశకంలో “ఆంతరాత్మ ప్రబోధం” పిలుపు ఓ సంచలనంగా మారింది.. ఇప్పుడు అదే తరహాలో మునుగోడు ఉప ఎన్నికలో కూడా “ఆంతరాత్మ ప్రబోధం” పిలుపు అస్త్రాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయోగిస్తారనే చర్చ సాగుతోంది.. ఏదేమైనా.. తన తమ్ముడు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. రాజీనామా వ్యవహారం కాకరేపుతోన్న సమయంలో… అమిత్‌షా దగ్గరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లడం మాత్రం ఆసక్తికరంగా మారింది.