Delhi: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. గోడ మీద ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడని ఓ బృందం అతడిని పొడిచి చంపేసింది. రద్దీగా ఉన్న మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఆ వ్యక్తి హత్యకు దారి తీసింది.
గురువారం ఢిల్లీలోని రద్దీగా ఉన్న మార్కెట్‌లో 25 ఏళ్ల యువకుడిని వెంబడించి కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోడపై మూత్ర విసర్జన చేయడంపై జరిగిన వాగ్వాదం దాడికి దారితీసిందని పోలీసులు తెలిపారు. హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి అయిన మయాంక్, నిందితులలో ఒకరి తల్లి గోడపై మూత్ర విసర్జన చేయడాన్ని వ్యతిరేకించడంతో ఆమెతో గొడవ పడ్డాడు. వాగ్వాదం సందర్భంగా నిందితుడిని దుర్భాషలాడి చెంపదెబ్బ కొట్టినట్లు కూడా సమాచారం.నిందితుడు మనీష్ తన స్నేహితులను పిలిచి మయాంక్, అతని స్నేహితుడు వికాస్‌ను వెంబడించాడు.
Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ‘చేతి’కి తెలంగాణ బాధ్యతలు.. ఠాగూర్ ఔట్..!
దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని డీడీఏ మార్కెట్ సమీపంలో మయాంక్‌ను పట్టుకున్న ఈ బృందం అతనిని దారుణంగా కత్తితో పొడిచి హత్యచేశారు పూర్తిగా ప్రజలు చూడకుండా కత్తితో పొడిచి చంపింది. అనంతరం ఆ బృందం అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. అందులోని ఫుటేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. మయాంక్‌ను ఎయిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు మనీష్, రాహుల్, ఆశిష్, సూరజ్‌లను గుర్తించారు. తొలుత రాహుల్, ఆశిష్, సూరజ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు,, ఆ తర్వాత బవానాకు చెందిన ప్రధాన నిందితుడు మనీష్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరానికి గల కారణాలను వెల్లడించాడు.