CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) ఇవాళ భేటీ కాబోతోంది. సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. పార్టీ అధినేత్రి సోనియా కోవిడ్ నుంచి కోలుకోగానే సీడబ్ల్యూసీనీ ఏర్పాటు చేసింది.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి పార్టీ జనరల్ సెకటరీలు, పలు రాష్ట్రాల ఇంఛార్జ్‌లు హాజరుకాబోతున్నారు.. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ నేతృత్వంలో ఉన్నత స్థాయు సమావేశం జరగనుంది.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్.. ప్రత్యేక ఆహ్వానితులుగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షులు, యూపీ ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా పాల్గొనన్నారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీపై చర్చించనున్నారు.. భారీ ర్యాలీ ఏర్పాట్లు, అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొనాల్సిన పార్టీ ప్రతినిధులు, కార్యాచరణను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయు సమావేశం. మరోవైపు, సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానున్న రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్ర పై కూడా చర్చ సాగనుంది… అక్టోబర్ 2 నుంచి “భారత్ జోడో” యాత్ ను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 7 కు మార్పు చేశారు.. సెప్టెంబర్ మొదటి వారంలో “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశం కాబోతోంది.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేయబోతున్నారు.. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతలను వేరేవారికి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?