దేశ రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రి కొవిడ్ వేరియంట్ మ్యుటేషన్‌పై అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా విడుదల కాలేదు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.
అప్పడాలు, మసాలా దినుసుల మాటున అమెరికా డాలర్లు తరలిస్తూ దొరికిపోయాడో వ్యక్తి.. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికిచేరుకున్నాడు ఓ వ్యక్తి… అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అతడి లగేజీని చెక్ చేశారు.. వాటిలో మసాలా దినుసుల బాక్సులు, అప్పడాల పాకెట్లు కనిపించాయి… అంతే కాదు.. అక్కడే ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంది.. అప్పడాల మధ్యలో దాదాపు 19,900 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.…
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసులు… మనదేశంలోనూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. దేశ రాజధానిలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్మాండవీయ వెల్లడించారు. విదేశీ పౌరుడైన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ వచ్చింది. అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా… మంకీపాక్స్ సోకింది. తాజా కేసుతో కలిపి ఢిల్లీలో.. మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. Read…
చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈ నెల 6వ తేదీ హస్తినకు వెళ్తారు చంద్రబాబు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగులో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు..
బీజేపీ చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీజేపీ తెలంగాణ నాయకత్వం.. ఇప్పటికే పార్టీలో చేరేందుకు సిద్ధమైనవారితో చర్చించి.. చేరికల కమిటీ ఓ జాబితాను తయారు చేసింది.
దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అందరికంటే ముందుగా విమానం నుంచి దింపేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కనీసం పట్టించుకోలేదు.
తన ప్రియురాలిని ఆకట్టుకోవాలని ఓ వ్యక్తి దొంగగా మారాడు. పశ్చిమ ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజనైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోసారి విచారణకు హాజరయ్యారు.