Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు.
Read Also: K Laxman: టీఆర్ఎస్‌కు నూకలు చెల్లాయ్.. అందుకే బీఆర్ఎస్‌తో కొత్త డ్రామా
సిలిగురి-గౌహతి రహదారిపై 11.65 కోట్ల విలువ చేసే 23.23 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. రహదారిపై మాటు వేసిన డీఆర్ఐ అధికారులు అనుమానాస్పదంగా ఉన్న లారీని తనిఖీ చేయగా.. అందులో భారీగా బంగారం బయటపడింది. అధికారులకు అనుమానం రాకుండా.. ముఠా పక్కా ప్రణాళికతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. బంగారం ఉన్న లారీకి రెండు కార్లు ఎస్కార్టుగా పెట్టుకుని బంగారాన్ని రవాణా చేస్తున్నారు. లారీకి ఎస్కార్ట్ గా ఉన్న రెండు కార్లను అడ్డగించారు అధికారులు. లారీతో పాటు రెండు కార్లను నలుగురిని అదుపులోకి తీసుకున్నారు డీఆర్ఐ అధికారులు.
అధికారుల విచారణలో విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల విచారణలో డీఆర్ఐ అధికారులే ఆశ్యర్యపోయేలా బంగారాన్ని లారీ చాసిస్ కింది భాగంలో దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీమ్స్ ఈ అక్రమ రవాణాకు బ్రేకులు వేశాయి. సెప్టెంబర్ మాసంలో 11 కేసుల్లో 121 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు.