దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా పేరుపొందాడు ఓ ఆటో డ్రైవర్. దొంగతనాలే కాకుండా హత్యలు కూడా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 వేలకు పైగా కార్లను దొంగిలించిన నిందితుడు "దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ" అనిల్ చౌహాన్‌ను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10…
దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై వేధింపులు, అత్యాచారాలు.. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది… దేశంలో ఏ నగరాల్లో ఏంటి పరిస్థితి.. మహిళలపై నేరాలు ఎలా జరుగుతున్నాయో పేర్కొంటూ నివేదిక విడుదల చేశారు.. ఆ నివేదికలో దేశ రాజధాని ఢిల్లీ టాప్ స్పాట్లో ఉంది.. గత ఏడాది ప్రతిరోజూ ఇద్దరు మైనర్ బాలికలు అఘాయిత్యాలు జరిగినట్టు ఆ నివేదిక స్పష్టం…
ఢిల్లీలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో పడనుందా..? అనే చర్చ మొదలైంది.. సీఎం కేజ్రీవాల్‌తో నిర్వహించిన కీలక భేటీకి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై… అనుమానాలు రేగుతున్నాయి. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచారు సీఎం కేజ్రీవాల్. ఎమ్మెల్యేలందరినీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం…
బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారం ప్రకంపనలు సృషిస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నేడు రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి బయలదేరనున్నారు. ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి బయలుదేరనున్నారు. ఇవాళ ఆదివారం రాత్రి 9.15 గంటలకు దిల్లీ చేరుకుని, జన్‌పథ్-1లో రాత్రి బస చేయనున్నారు. ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయన చర్చించనున్నారు. దాంతోపాటుగా.. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఏపీకి…
ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.