Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని జోర్ బాగ్‌కు చెందిన మద్యం పంపిణీ సంస్థ ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్రును ఈరోజు ఉదయం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మహేంద్రును మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాత్రి సుదీర్ఘ ప్రశ్నోత్తరాల అనంతరం అరెస్టు చేసినట్లు తెలిసింది. అతనిని స్థానిక కోర్టులో హాజరుపరచాలని భావిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా సహాయకుడు విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసిన ఒకరోజు తర్వాత సమీర్ మహేంద్రు అరెస్ట్ కావడం గమనార్హం. ఈ విధానం వల్ల మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
విజయ్ నాయర్‌తో పాటు మరో 14 మందికి మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వీరిలో వివిధ ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌లలో కామెడీ షోలు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నట్లు చెబుతోంది. వీటిలో విజయ్ నాయర్‌తో సంబంధం ఉన్న కంపెనీలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇది దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భయపడి, రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసేందుకు భాజపా ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆప్ ఆరోపిస్తోంది. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఎదుగుతున్నారన్న ఉద్దేశంతోనే బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని మండిపడుతోంది.
Manchireddy Kishan Reddy: రెండో రోజు ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ప్రభుత్వోద్యోగులు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ ఉన్నారు.ఇతర నిందితులు పెర్నోడ్ రికార్డ్ మాజీ ఉద్యోగి మనోజ్ రాయ్, బ్రిండ్‌కో సేల్స్ డైరెక్టర్ అమన్‌దీప్ ధాల్, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా, దినేష్ అరోరా, మహాదేవ్ లిక్కర్స్ సన్నీ మార్వా, అరుణ్ రామచంద్ర పిళ్లై, అర్జున్ పాండేలు ఉన్నారు. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని ఈడీ ఆరోపించింది.