ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
పంజాబ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. సుఖేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో... సమన్లు ఇచ్చారు.
Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే రావణాసుర దహన కార్యక్రమానికి నిర్వాహకులు ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రావణ దహనం చేసేందుకు ‘ఆదిపురుష్’లో రాముడిగా కన్పించే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను మించిన అతిథి మరొకరు ఉండరని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కంటే మరో హీరో పేరు కూడా తమకు ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని వాళ్లు…
జీవితంలో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ.. 75 శాతం మేధో వైకల్యంతో పాటు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ 14 ఏళ్ల బాలిక జీవితాన్ని యోగా మార్చేసింది. ఆమె ఎవరో కాదు 'రబ్బర్ గర్ల్'గా పేరొందిన అన్వీ విజయ్ జంజారుకియా. ఆమె నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని ముందు అన్వీ యోగాను ప్రదర్శించారు.
జార్ఖండ్‌లో ఇప్పటికే తీవ్ర రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొట్టుమిట్టాడుతుండగా.. ప్రస్తుతం అతని తమ్ముడి వల్ల మరో సమస్య మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రి సోదరుడు, దుమ్కా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నోటి దురుసు వల్ల వార్తల్లో నిలిచారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కోసం ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమావేశమయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 7 గంటలకు ఇండియా గేట్ వద్ద కర్తవ్యపథ్‌తో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటుందని, ఈ అమృత్కాల్ మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మనల్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా 32 ఏళ్ల మహిళ కడుపు నుంచి నాలుగు కిలోల భారీ మెసెంటెరిక్ కణితిని విజయవంతంగా తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.