Andhra Pradesh: చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.…
Cyclone Sitrang : తుఫాను 'సిత్రాంగ్' బలపడి బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది… ఇవాళ అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. క్రమంగా వాయుగుండంగా మారుతోంది అల్పపీడనం… రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది… అనంతరం సిత్రాంగ్ తుఫాన్ గా బలపడనుంది వాయుగుండం… ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది… వాయుగుండంగా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచేఅవకాశం ఉండగా.. అక్కడక్కడా ఓ మోస్తరు లేదా…
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. దీంతో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వరంగల్,…
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘అసని’ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది.. మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీన పడిన ‘అసని’.. గత 6 గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందని.. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది.. అయితే, అసని కదలికలో వేగం తగ్గింది.. నెమ్మదిగా కదులుతోందని విపత్తుల సంస్థ ప్రకటించింది.. అసని తుఫాన్‌పై తాజా బులెటిన్ విడుదల చేశారు ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్.. అసని రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొన్నారు.. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలిందని.. మూమెంట్ నెమ్మదిగా ఉందన్నారు.. ప్రస్తుతం మచిలీపట్నానికి 40 కిలోమీటర్లు, నరసాపురంకు…
అసని తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతోంది… ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వైపు అసని దూసుకొస్తుండడంతో ఆ ఎఫెక్ట్ తీర ప్రాంతాలపై పడుతోంది.. ఇక, రేపు తీరం దాటనున్న నేపథ్యంలో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.. ప్రస్తుతం కాకినాడకు ఆగ్నేయ౦గా 210 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది అసని తీవ్ర తుఫాన్.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ముందుకు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది.. ఇప్పటికే తీరం వెంబడి ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.. మరోవైపు అసని తుఫాన్‌తో అలెర్ట్ అయ్యింది తూర్పు నావికాదళం.. ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తీవ్ర తుఫాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది నావికాదళం… విపత్కర పరిస్థితుల్లో సహాయ, వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలు, హెలీకాఫ్టర్లును అందుబాటులో ఉంచింది నేవీ.. విశాఖలోని ఐ.ఎన్.ఎస్ డేగా… చెన్నైలోని ఐ.ఎన్.ఎస్ రాజాలీ నుంచి ఏరియల్ సర్వే,…
అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తోంది.. ఆ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, అసని తుఫాన్‌పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశాపై ‘అసని’ తుఫాన్ ప్రభావం, దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధతపై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిగింది.. తుఫాన్ రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాకినాడ-విశాఖపట్నం తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని.. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై…