అసని తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతోంది… ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వైపు అసని దూసుకొస్తుండడంతో ఆ ఎఫెక్ట్ తీర ప్రాంతాలపై పడుతోంది.. ఇక, రేపు తీరం దాటనున్న నేపథ్యంలో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.. ప్రస్తుతం కాకినాడకు ఆగ్నేయ౦గా 210 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది అసని తీవ్ర తుఫాన్.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది.. వాయువ్య దిశ నుండి పశ్చమ వాయువ్యంగా దిశను మార్చుకొని మచిలీపట్నం వైపుగా కదులుతోన్నట్టు వాతావరణశాఖ చెబుతోంది.
Read Also: Home Loan: వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాంకులు.. హోంలోన్లపై భారం..!
ఏపీ తీరంకి మరింత చేరువగా వస్తూ కాకినాడ వద్ద తీరం తాకుతూ కదలనుంది అసని తీవ్ర తుఫాన్.. రేపు సాయంత్రంకి బలహీనపడి తుఫాన్ గా మారనుంది.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ వార్నింగ్, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు అధికారులు.. రేపు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇష్యూ చేశారు.. కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్ట్ లలో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. ఏపీలోని మిగిలిన పోర్ట్ లలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.. కోస్తా తీరంలో విస్తారంగా వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిమీ, రేపు 65 నుండి 75 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ చెబుతోంది.