Cyclone Sitrang: ఏపీవైపు దూసుకొస్తున్న ‘సిత్రాంగ్’..! అప్రమత్తమైన అధికారులు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది… ఇవాళ అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. క్రమంగా వాయుగుండంగా మారుతోంది అల్పపీడనం… రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది… అనంతరం సిత్రాంగ్ తుఫాన్ గా బలపడనుంది వాయుగుండం… ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది… వాయుగుండంగా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచేఅవకాశం ఉండగా.. అక్కడక్కడా ఓ మోస్తరు లేదా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. 24 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడిన తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో 25 తర్వాత బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు శనివారం నుంచి సోమవారం వరకు ఒడిశా వైపు చేపల వేటకు వెళ్లొదని హెచ్చరించింది వాతావరణశాఖ..
Read Also: Astrology : అక్టోబర్ 22, శనివారం దినఫలాలు
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
ఇక, తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తం అవుతున్నారు అధికారులు.. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. జిల్లా కలెక్టర్ కార్యాలయం, అమలాపురంలో 08856 293104, వాట్సాప్ నంబర్ : 99495 15348, అమలాపురం ఆర్డీవో కార్యాలయం: 08856 233100, రామచంద్రాపురం ఆర్డీవో కార్యాలయం : 08857 245166, కొత్తపేట ఆర్డీవో కార్యాలయం: 9059461848 నంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు.
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!