ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘అసని’ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది.. మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీన పడిన ‘అసని’.. గత 6 గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందని.. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. బలహీన పడినప్పటికి ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.
Read Also: Dasoju Sravan : అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తాం ..