Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel – Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై బీకర దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేసింది.. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.. ఈ దాడిలో ఏకంగా 36 మంది విద్యార్థులు మృతి చెందారు. అంతే కాదు.. ఇరాన్‌లో చాలా ప్రదేశాలు బాంబుల దాడు జరిగాయని ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి.
READ MORE: Israel – Iran War Live Updates : ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. టెహ్రాన్‌లోని యూనివర్సిటీ స్ట్రీట్, జొంహౌరీ ప్రాంతాలపై క్షిపణులు పడినట్లు తెలుస్తోంది. ఉత్తర టెహ్రాన్‌లోని సెయ్యెద్ ఖండాన్ ప్రాంతంలో సైతం పేలుళ్లు సంభవించాయని టస్నీమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. నగరంపై పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పశ్చిమ ఇరాన్‌లోని ఇలాం ప్రావిన్స్ సహా దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమ ఇరాన్‌లో సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ దాడులు సైనిక, రక్షణ స్థావరాలపైనే కాకుండా పలు నగరాల్లోని పౌర మౌలిక సదుపాయాలనూ లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్, ఇది స్పష్టమైన దాడి చర్యగా పేర్కొంది. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సంయుక్త ఆపరేషన్‌పై స్పందిస్తూ, “ఇరాన్ పాలక వ్యవస్థ నుంచి ఉద్భవిస్తున్న తక్షణ ముప్పును నిర్మూలించడమే మా లక్ష్యం. అమెరికా ప్రజలను రక్షించడానికే ఈ పెద్ద స్థాయి సైనిక చర్య ప్రారంభించాం” అని అన్నారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.
READ MORE: Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!