ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
Cyclone Montha: నెల్లూరు జిల్లాను బలంగా కొట్టేందుకు తుఫాన్ దూసుకొస్తుంది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అందుకు తగ్గట్లుగానే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటుంది నెల్లూరు జిల్లా యంత్రాంగం. 144 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. ప్రతి రెవిన్యూ డివిజన్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు..…
Cyclone Montha: తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి.. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడండి. ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని.. ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం…
Cyclone Effect: విశాఖపట్నంపై భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి.. వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్‌లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్‌లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది.. ఇక, విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో బెంబేలెత్తుతున్నారు విశాఖ నగరవాసులు.. Read Also:…
Andhra Pradesh: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వద్దు బాబోయ్ ఈ వర్షాలు అనే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఉదయం ఎండలు.. రాత్రికి వానలు.. కొన్ని రోజులైతే ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తే.. ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచింది ఉంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మరి కొద్ది…
Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం గండం తప్పినట్టు అయ్యింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తెల్లవారు జామున తీరం దాటింది.. గోపాల్ పూర్ సమీపంలో తీరాన్ని దాటి బలహీన పడుతోంది వాయుగుండం.. దీంతో, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, ఈ ప్రభావంతో ఇవాళ నెల్లూరు మినహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుయనున్నాయి.. ఇదే సమయంలో, సముద్రం కల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు,…
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. Also…
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు..
Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ (మే 29) ఉత్తర ఆంధ్ర తీరం దాటి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రానున్న మూడు రోజుల పాటు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు…
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.