బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. దీంతో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వరంగల్, హన్మకొండ, భూపాల్‌పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉందని, వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం ఉత్తరాంధ్రపై తగ్గిందని అమరావతి వాతావరణకేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులపాటు ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఇప్పటికే తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. మన్యం జిల్లా భామిని, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, పాలకొండ మండలాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అటు విజయనగరం, బబ్బిలి, సాలూరు తదితర మండలాల్లో చెదురుమదురుగా జల్లులు కురవగా.. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం తోలు మందం.. బుర్ర లేని ప్రభుత్వం..!