బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది.. ఇప్పటికే తీరం వెంబడి ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.. మరోవైపు అసని తుఫాన్‌తో అలెర్ట్ అయ్యింది తూర్పు నావికాదళం.. ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తీవ్ర తుఫాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది నావికాదళం… విపత్కర పరిస్థితుల్లో సహాయ, వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలు, హెలీకాఫ్టర్లును అందుబాటులో ఉంచింది నేవీ.. విశాఖలోని ఐ.ఎన్.ఎస్ డేగా… చెన్నైలోని ఐ.ఎన్.ఎస్ రాజాలీ నుంచి ఏరియల్ సర్వే, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. 19 వరద సహాయ బృందాలు, ఆరు డైవింగ్ టీమ్స్, జెమినీ బోట్లుతో కూడిన ఐదు యుద్ధనౌకలు సంసిద్ధం చేశారు.. ఐ.ఎన్.ఎస్. డేగ యుద్ధ స్థావరంలో హెలీకాఫ్టర్లను మోహరించిన నావికాదళం.. మొత్తంగా అసని ఎలాంటి విపత్కర పరిస్థితి సృష్టించేందుకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది నావికాదళం.
Read Also: Cyclone Asani: దూసుకొస్తున్న ‘అసని’.. కేంద్ర హోంశాఖ సమీక్ష